allu arjun: బన్నీ నెక్స్ట్ మూవీ ఫిక్సయింది .. దర్శకుడు లింగుస్వామితోనే సెట్స్ పైకి!

  • నా పేరు సూర్య' షూటింగులో అల్లు అర్జున్ 
  • లింగుస్వామితో మూవీకి తొలగిన అడ్డంకులు 
  • విక్రమ్ కుమార్ తో మూవీ ఆలస్యం

ప్రస్తుతం అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన లింగుస్వామితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. దాంతో విక్రమ్ కుమార్ తో సినిమా చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ వున్నాడనే ప్రచారం మొదలైంది.

 కానీ అల్లు అర్జున్ .. లింగుస్వామి కాంబినేషన్ కి సంబంధించిన ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయట. దాంతో ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. విశాల్ మూవీ పూర్తి చేసి లింగుస్వామి .. 'నా పేరు సూర్య ' పూర్తి చేసి అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుపైకి రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసిన లింగుస్వామి, త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నాడట. 

  • Loading...

More Telugu News