t20: టీ20 మ్యాచ్ టికెట్లు కొన్నవారికి ఊరట.. టికెట్ డబ్బులు ఇచ్చేస్తారట!

  • టికెట్లు కొన్నవారికి డబ్బులు చెల్లిస్తామన్న హెచ్ సీఏ
  • చెల్లింపు తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటన
  • టికెట్లను జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని సూచన

వర్షం కారణంగా నిన్న రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ముగిసింది. దీంతో, ఆటగాళ్ల మెరుపులు చూద్దామని ఆశించిన అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే హెచ్ సీఏ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే, మ్యాచ్ జరగకుండా పోయిందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

మరోవైపు, మ్యాచ్ రద్దైన నేపథ్యంలో టికెట్లు కొనుగోలు చేసినవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని హెచ్ సీఏ అధికారులు తెలిపారు. ఏయే రోజుల్లో డబ్బును చెల్లిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అప్పటి వరకు ప్రేక్షకులు తమ టికెట్లను భద్రంగా దాచుకోవాలని సూచించారు. అయితే, మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తారా? లేదా పన్నులు మినహాయించుకుని చెల్లిస్తారా? అనే విషయంలో క్లారిటీ లేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News