balakrishna: ఎన్టీఆర్ జయంతి రోజునే ఆయన బయోపిక్ రిలీజ్

  •  ఎన్టీఆర్ బయోపిక్ పై అందరిలో ఆసక్తి 
  •  ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ
  •  దర్శకుడిగా తేజ
  •  చివరిదశలో స్క్రిప్ట్ పనులు          

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఎన్టీఆర్ బయోపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనున్నాడనీ .. తేజ దర్శకత్వం వహించనున్నాడనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా .. ఎప్పుడు విడుదలవుతుందా అనే విషయాల్లో అంతా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

 కార్తీక మాసంలో ఓ మంచి రోజున ఈ సినిమా లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరి దశకి చేరుకున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ జీవితంలో ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడ పూర్తవుతుంది? అనేది చర్చనీయాంశమైంది.          

  • Loading...

More Telugu News