kodanda ram: కోదండరామ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు!

  • అమరవీరుల స్ఫూర్తి యాత్రకు సిద్ధమైన కోదండరామ్
  • ఇంటివద్దే అడ్డుకున్న పోలీసులు
  • హోం మంత్రిని కలిసేందుకు జేఏసీ నేతల ప్రయత్నాలు

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు నుంచి వరంగల్ జిల్లాలో తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్రను నిర్వహించేందుకు జేఏసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, స్ఫూర్తి యాత్రకు ప్రభుత్వం ఒప్పుకోని పక్షంలో... జేఏసీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు. మరోవైపు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

kodanda ram
tjac
tjac chairman
amaraveerula spoorthi yatra
  • Loading...

More Telugu News