shatrughan sinha: అద్వానీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శత్రుఘ్నసిన్హా.. సొంత ప్రభుత్వంపై మరో మారు విరుచుకుపడిన వైనం!

  • నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన
  • అద్వానీ రాష్ట్రపతి కావాలని పార్టీలో 80 శాతం మంది కోరుకున్నారని వ్యాఖ్య
  • ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని జీఎస్టీకి కొత్త భాష్యం  

సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే బీజేపీ నేత, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిందన్న ఆయన జీఎస్టీతో బీహార్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని బీహార్  ప్రజలు అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రాష్ట్రపతి కావాలని బీజేపీలోని 80 శాతం మంది కోరుకున్నారని అన్నారు. నోట్ల రద్దు ప్రభావం ప్రజలపై చాలా తీవ్రంగా పడిందని, పేదలు, వ్యాపారవేత్తల్లో భయాందోళనలు రేకెత్తించిందని ఆరోపించారు. మధ్య తరగతి కుటుంబాలు, యువతరం, నిరుద్యోగం, చిన్న వ్యాపారులు, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు.

ఇదే విషయంపై ఆర్థికశాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ఆందోళన వ్యక్తం చేశారన్నారు. బీహార్ ప్రజలు ఇప్పటికీ ఈ సమస్యల నుంచి బయటపడలేదని, ఏ ఇద్దరు కలిసినా జీఎస్టీ అర్థం గురించే మాట్లాడుకుంటున్నారని అన్న సిన్హా ‘గెయిల్ సర్కార్ తోహర్ (ఈ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లింది) అని జీఎస్టీకి అర్థమని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News