south Korea: ఉత్తరకొరియాకు షాక్ ఇచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

  • ఉత్తరకొరియాకు వీసా సర్వీసులు నిలిపేసిన యూఏఈ
  • యూఏఈ నిర్ణయాన్ని అనుసరిస్తామన్న కువైట్, ఖతార్
  • అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమంటూ ప్రకటన

ఉత్తర కొరియాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఊహించని షాకిచ్చింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన యూఏఈ..అందులో ఉత్తర కొరియన్లకు ఇకపై వీసా సర్వీసులు అందించబోమని తేల్చిచెప్పింది. అంతే కాకుండా ఉత్తర కొరియా నుంచి తమ రాయబారిని రద్దుచేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఉత్తర కొరియా పౌరులు, కంపెనీలకు వీసాలు ఇవ్వమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎంతో బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ నిర్ణయాన్ని కువైట్, ఖతార్ లు కూడా అనుసరిస్తున్నట్టు ప్రకటించాయి. కాగా, ఉత్తరకొరియా నిర్వహిస్తున్న అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ వెల్లడించింది. కాగా, యూఏఈలో 1300 మంది ఉత్తరకొరియన్లు జీవనోపాధి పొందుతున్నారని దక్షిణకొరియా పేర్కొంది. 

  • Loading...

More Telugu News