accident: ఈ ప్రమాదాన్ని చూస్తే.. 'ఎలా జరిగిందా?' అని ఆశ్చర్యపోవడం ఖాయం... వీడియో చూడండి!

  • చైనాలోని స్వీహ్వా నగరంలోని జాతీయ రహదారిపై ప్రమాదం
  • రోడ్డును వదిలి దూసుకెళ్లిన కారు
  • కిందపడుతుండగా చెట్లమధ్య ఇరుక్కున్న కారు

సాధారణంగా ప్రమాదం జరిగితే ఇంత ఘోర ప్రమాదం జరిగిందా? అని ఆశ్చర్యపోతుంటాం. అయితే చైనాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాడాన్ని చూస్తే మాత్రం 'ఈ ప్రమాదం ఇలా ఎలా జరిగిందా?' అని ఆశ్చర్యపోవడం ఖాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని స్వీహ్వా నగరంలోని ఒక జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పడంతో అది రోడ్డు పక్కకి గాల్లోకి దూసుకెళ్లింది.

అలా వేగంగా రోడ్డును వీడి దూసుకెళ్లిన కారు... చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కుపోయింది. రాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చెట్ల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ఎవరూ గాయపడలేదు. మరుసటి రోజు అటుగా వెళ్తున్న ప్రయాణికులు గాల్లో వేలాడుతున్న కారును చూసి ఆశ్చర్యపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి క్రేన్ సాయంతో కారును కిందికిదించారు. దీనిని వీడియో తీసిన పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ గా మారింది. ఇలాంటి ప్రమాదం ఎక్కడైనా చూశారా? అంటూ నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు.

accident
china
viral video
car accident
  • Error fetching data: Network response was not ok

More Telugu News