ys jagan: పాదయాత్రతో కాళ్ల నొప్పులు తప్ప.. మరేం రాదు: జగన్ పై ఆదినారాయణరెడ్డి సెటైర్లు

  • పాదయాత్ర వల్ల జనాలకు ఒరిగేదేమీ లేదు
  • వైసీపీ కనుమరుగు కావడం ఖాయం
  • 3 వేలు కాదు 30 వేల కి.మీ. నడిచినా ఉపయోగం లేదు

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై మంత్రి ఆదినారాయణరెడ్డి సెటైర్లు వేశారు. కాళ్ల నొప్పులు తెచ్చుకునేందుకు జగన్ పాదయాత్రను చేపట్టబోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. 3 వేల కిలోమీటర్లు కాదు, ముప్పైవేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని, వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.

నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి చిత్తూరు జిల్లా మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు యాత్ర కొనసాగనుంది. ఆరు నెలల పాటు దాదాపు 3వేల కిలోమీటర్ల దూరం ఆయన నడవనున్నారు.

ys jagan
ysrcp
jagan padayatra
minister adinarayana reddy
  • Loading...

More Telugu News