vamsi paidipalli: మహేశ్ మూవీ కోసం లొకేషన్స్ వేటలో వంశీ పైడిపల్లి

  • మహేశ్ 25వ సినిమాకి దర్శకుడిగా వంశీ పైడిపల్లి 
  • 'ఊపిరి' తరువాత చేస్తున్న సినిమా ఇది 
  • నిర్మాతగా దిల్ రాజు 
  • త్వరలోనే సెట్స్ పైకి    

ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మహేశ్ కి ఇది 25వ సినిమా .. అందువలన ఈ మూవీ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు.

 కథ రీత్యా ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అమెరికాలో జరగనుంది. అందువలన వంశీ పైడిపల్లి తన టీమ్ తో లొకేషన్స్ ను ఎంపిక చేయడానికి న్యూయార్క్ వెళ్లాడు. గతంలో ఆయన 'మున్నా' .. 'బృందావనం' .. 'ఎవడు' .. 'ఊపిరి' సినిమాలను తెరకెక్కించాడు. 'ఊపిరి' తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఆయన చేస్తోన్న సినిమా ఇదే. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.       

vamsi paidipalli
  • Loading...

More Telugu News