child marriage: బాల్య వివాహాం రద్దు కోసం ఫేస్‌బుక్‌ను వాడుకుని విజయం సాధించిన యువతి!
- పరిగణనలోకి తీసుకున్న రాజస్థాన్ కోర్టు
- వివాహాన్ని రద్దు చేస్తూ ఆదేశం
- సామాజిక వాది సాయంతో కేసు గెలిచిన సుశీల
రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆడపిల్లల ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా జరిగే ఈ వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరుగుతున్నా వాటిని అడ్డుకోలేకపోతున్నారు. తన అంగీకారంతో సంబంధం లేకుండా సుశీల బిష్ణోయికి కూడా 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు బాల్య వివాహం చేశారు. కానీ ఆమె సర్దుకుపోలేదు. తన వివాహానికి వ్యతిరేకంగా 19 ఏళ్ల సుశీల ఇప్పుడు పోరాటం చేసింది. పెళ్లైన తర్వాత ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. ఆ సమయంలో పరిచయమైన సామాజిక వాది భారతి సాయంతో వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో అయితే తమకు వివాహం జరగలేదని, పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని ఆమె భర్త బెదిరించడం మొదలు పెట్టాడు. తమకు వివాహం జరిగిందనడానికి సాక్ష్యంగా సుశీల, ఆమె భర్త ఫేస్‌బుక్ అకౌంట్ వివరాలను సమర్పించింది. అందులో తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, ఆమె భర్త స్నేహితులు పెళ్లి శుభాకాంక్షలు తెలపడం వున్నాయి. ఈ అంశాన్ని సాక్ష్యంగా పరిగణించి రాజస్థాన్ కోర్టు ఆమె వివాహాన్ని రద్దు చేసింది.