world cup: ఫీఫా అండ‌ర్ 17 ప్రపంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన భార‌త్‌

  • ప్రీ క్వార్ట‌ర్స్‌కు చేరుకోలేక‌పోయిన భార‌త్‌
  • లీగ్ మ్యాచ్‌లో ఘ‌నా జ‌ట్టుపై ఓట‌మి
  • నిరాశ మిగిల్చిన అమ‌ర్‌జీత్ సింగ్ సేన‌

మొద‌టిసారి భార‌త దేశంలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ ప్ర‌పంచ క‌ప్ అండ‌ర్ 17లో భార‌త జ‌ట్టు నిరాశ మిగిల్చింది. లీగ్ మ్యాచ్‌లోనే వెనుదిరిగి భార‌త్ ఫుట్‌బాల్ అభిమానుల‌ను నిరుత్సాహ ప‌రిచింది. తొలిసారి అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో పాల్గొన్న భార‌త జ‌ట్టు క‌నీసం ప్రీ క్వార్ట‌ర్స్ వ‌ర‌కు కూడా చేరుకోలేక‌పోయింది.

గ్రూప్-ఎలో ఘ‌నా జ‌ట్టుతో జ‌రిగిన ఆఖ‌రి లీగ్‌ మ్యాచ్‌లో 0-4 గోల్స్ తేడాతో భార‌త జ‌ట్టు ఓడిపోయింది. దీంతో ఒక్క విజ‌యాన్ని కూడా న‌మోదు చేసుకోకుండానే అమ‌ర్‌జీత్ సింగ్ సేన వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రూప్-ఎ నుంచి ఘ‌నా, కొలంబియా జ‌ట్లు, గ్రూప్-బి నుంచి ప‌రాగ్వే, మాలి జ‌ట్లు ప్రీ క్వార్ట‌ర్స్‌కు చేరుకున్నాయి.

world cup
football
under 17
bharat
ghana
league
pre qaurters
colombia
america
mali
  • Loading...

More Telugu News