king cobra: గ్రామ ప్రజలను భయపెట్టిన 18 అడుగుల కింగ్ కోబ్రా!

  • ప్రదానో ఇంట్లో దూరిన పెద్ద కింగ్ కోబ్రా
  • దానిని చూసి గ్రామస్థులకు చెప్పిన ప్రదానో
  • సోంపేటలో పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి పట్టించిన గ్రామస్థులు

శ్రీకాకుళం జిల్లాలో ఒక గిరిజన గ్రామస్థులను 18 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా బెంబేలెత్తించింది. దాని వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బొగాబెణి గిరిజన గ్రామానికి చెందిన దమ్మ ప్రదానో ఇంట్లోకి 18 అడుగుల పొడవైన పెద్ద కింగ్‌ కోబ్రా చొరబడింది. ఇంట్లోకి పెద్ద పాము వెళ్తుండడం చూసిన ప్రదానో భయంతో గ్రామస్థులకు చెప్పాడు. దీంతో సోంపేటలో పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి అతనిని రప్పించారు. ఆయన ఇంట్లోకి వెళ్లి దానిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. దానిని చూసిన ప్రజలు భయపడిపోయారు. ఆ వ్యక్తి దానిని దగ్గర్లోని అడవిలో విడిచిపెట్టాడు.

king cobra
srikakulam
kanchili
sompeta 18 feet king cobra
  • Error fetching data: Network response was not ok

More Telugu News