amrapali: మరోసారి సాహసం చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి

  • ఇనుపగుట్టల్లో ట్రెక్కింగ్ చేసిన కలెక్టర్
  • ట్రెక్కింగ్ లో పాల్గొన్న విద్యార్థులు, అధికారులు
  • గతంలో కూడా పలు సాహసకార్యాలు చేసిన ఆమ్రపాలి

సాహసకార్యాలకు కేరాఫ్ అడ్రస్ వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. మోడ్రన్ లుక్ లో ఉండే ఆమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె మరో సాహసం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో దేవునూరు ఇనుప గుట్టల్లో జరిగిన ట్రెక్కింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నిట్ విద్యార్థులతో పాటు, పలువురు అధికారులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. గతంలో కూడా మరో ఐఏఎస్ అధికారిణి ప్రీతి మీనాతో కలసి మహబూబ్ నగర్ జిల్లాలోని బయ్యారం చెరువు, పెద్ద గుట్టల్లో ఆమె పర్యటించారు. ఆ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

amrapali
warangal urban collector
  • Loading...

More Telugu News