rains: ఇంట్లోకి వరదనీరు చేరిందా?... దానిని ఉప్పుగా మార్చి పారేయండి...!: బెంగళూరు విద్యార్థుల చిట్కా

  • బెంగళూరు స్కూలు విద్యార్థుల ఘనత
  • వర్షాకాలంలో ఇంట్లో చేరిన నీటిని ఉప్పుగా మార్చి పారబోయమంటున్న విద్యార్థులు
  • నీరు ఉప్పుగా మారడానికి పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలే

హైదరాబాదుతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, వాగులు, వంకలతో ఇళ్లలోకి నీరు చేరుతోంది. వర్షాలు తగ్గినా అప్పటికే ఇంట్లోకి చేరిన నీటిని బయటికి పారబోయడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో వరద ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని బెంగళూరుకు చెందిన స్కూల్ విద్యార్థులు భరోసా ఇస్తున్నారు.

 నీటిని ఎత్తిపారేయడం కష్టం కనుక.. ఇంట్లో చేరిన నీటిని ఉప్పుగా మార్చేసి, ఆ ఉప్పుని బయటపారేయండని సలహా ఇస్తున్నారు. ఇంట్లో చేరిన నీరు ఉప్పుగా మారేందుకు పట్టే సమయం కేవలం ఐదు నుంచి పది నిమిషాలని వారు చెబుతున్నారు. కేవలం 70 నుంచి 80 రూపాయల విలువ చేసే సోడియం పాలీ క్రైలేట్ ను ఇంట్లోకి చేరిన వరదనీటిలో రెండు లేదా మూడు టీస్పూన్లు వేస్తే ఆ నీరు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఉప్పుగా మారుతుందని, దానిని ఎత్తి బయట పారేయడం సులువని స్కూలు విద్యార్థులు చెబుతున్నారు.  

rains
water
salt
polyacrylate
Bangalore
school students
  • Loading...

More Telugu News