uma bharathi: గాంధీ హత్యతో లాభపడింది వారే!: కేంద్ర మంత్రి ఉమాభారతి

  • గాంధీ హత్యతో లాభపడింది కాంగ్రెస్ పార్టీనే
  • ఇదే సమయంలో ఆరెస్సెస్ అణచివేతకు గురైంది
  • ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు

మహాత్మాగాంధీ హత్యతో లాభపడింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఆరెస్సెస్ అణచివేతకు గురైందని అన్నారు. అప్పట్లో సంఘ్ నిషేధానికి కూడా గురైందని తెలిపారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని మూసివేయాలని గాంధీ నిర్ణయించారని... దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన కూడా చేశారని చెప్పారు. మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి మరోసారి దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అంశంపై మీడియా ప్రశ్నించగా ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు.

uma bharathi
gandhi assassination
supreme court
rss
sangh pariwar
  • Loading...

More Telugu News