ram gopal varma: దర్శకుడు వర్మపై విమర్శలు గుప్పించిన మంత్రి అమర్ నాథ్ రెడ్డి

  • వర్మ ఎలాంటివారో అందరికీ తెలుసు
  • ఆయన ఏం చేస్తారో ఆయనకే అర్థంకాదు
  • నిర్మాత రాకేష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటివారో, ఆయన వ్యక్తిత్వం ఏమిటో ప్రజలందరికీ తెలుసని ఏపీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. సెన్సేషన్ కోసం సినిమాలు తీస్తూ, క్యాష్ చేసుకోవడమే వర్మ పని అని విమర్శించారు. ఆయనకు నచ్చిన కోణంలో సినిమా తీసినంత మాత్రాన ప్రజలు ప్రభావితమవరని అన్నారు. ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదని చెప్పారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదని అన్నారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ram gopal varma
lakshmis ntr
tollywood
producer rakesh reddy
minister amarnath reddy
Telugudesam
  • Loading...

More Telugu News