geetamadhuri: చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు .. ఒక సంఘటనను మాత్రం మరిచిపోలేను : గీతామాధురి
- సింగర్ గా గీతామాధురికి యూత్ లో క్రేజ్
- ఈవెంట్స్ నుంచి వరుస అవకాశాలు
- అప్పుడప్పుడు ఇబ్బందిపెట్టే సంఘటనలు
సినీ గాయనిగా గీతామాధురికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. అందువలన పలు ఈవెంట్స్ నుంచి ఆమెకి అవకాశాలు వస్తుంటాయి. ఈవెంట్స్ లో స్టేజ్ పై గీతామాధురి ఒక రేంజ్ లో సందడి చేస్తుందనీ .. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అనేవారు లేకపోలేదు. అలాంటి గీతామాధురి తనకి ఎదురైన చేదు అనుభవాలను ఐ డ్రీమ్స్ తో పంచుకుంది.
ఇంతవరకూ తాను చాలా ఈవెంట్స్ చేస్తూ వచ్చాననీ .. తనకి డబ్బులు ఎగ్గొట్టినవాళ్లు చాలామందే వున్నారని చెప్పింది. ఇదిగో తెస్తున్నాం .. అదిగో ఇస్తున్నాం అంటూ లేట్ చేస్తారనీ .. దీంతో చూసి చూసి, తనకి ఫ్లైట్ టైమ్ అయ్యేసరికి తాను వెళ్లిపోయేదానినని అంది. ఇక ఒకసారి .. ఒక ఈవెంట్ కి సంబంధించిన వాళ్లు, ప్రోగ్రామ్ పూర్తయ్యాక తాను గీతామాధురిని కాదంటూ వాదనకి దిగారని చెప్పింది. డబ్బులు ఎగ్గొట్టడం కోసం వాళ్లు అలా ప్రవర్తించారనీ, తాను గీతామాధురిననే విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం తనకి లేదు కనుక వదిలేశానని చెప్పుకొచ్చింది.