delhi: ఎంపీ ఇంట్లోని పనిమనిషిపై అత్యాచారానికి తెగబడ్డ కాంగ్రెస్ నేత!

  • హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి అత్యాచారానికి తెగబడ్డాడని పోలీసులకు ఫిర్యాదు 
  • ఎంపీ నివాసంలో పనిమనిషిగా పని చేస్తున్న తెలంగాణ మహిళ
  • ఎంపీ లేని సమయంలో ఇంటికి వచ్చి మూడు సార్లు అత్యాచారం చేశాడన్న మహిళ

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పని మనిషిపై మరో కాంగ్రెస్ నేత అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలో నివాసం ఉంటున్న కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో తెలంగాణకు చెందిన మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది. 2015 సెప్టెంబర్ 15 నుంచి 23 మధ్య ఎంపీ లేనప్పుడు ఆయన ఇంటికి వచ్చిన హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి తనపై అత్యాచారానికి తెగబడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అయితే తమ నుంచి డబ్బు గుంజేందుకే పనిమనిషి తప్పుడు ఆరోపణలు చేస్తోందని సుభాష్ చౌదరి ఆరోపిస్తున్నారు. 

delhi
telangana
lodhi estate
lady rape
cheating
  • Loading...

More Telugu News