ongole mp: తప్పుడు ఫిర్యాదులు చేసి కూలీ కూడా లేకుండా చేశారు: వైసీపీ ఎంపీని అడ్డుకున్న కూలీలు

  • ఎంపీని ఘెరావ్ చేసిన ఉపాధి హామీ కూలీలు
  • తప్పుడు లేఖలు రాశారంటూ ఆగ్రహం
  • కూలి కూడా రాకుండా చేశారంటూ ఫైర్

ఒంగోలు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామంలో జరిగిన హస్తకళల సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. ఆయన రాక గురించి తెలుసుకున్న ఉపాధిహామీ కూలీలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తప్పుడు లేఖలు రాసి, తప్పుడు ఫిర్యాదులు చేసి, ఉపాధి హామీ పథకానికి నిధులు రాకుండా చేశారని... తమకు కూలీ కూడా దక్కకుండా చేశారంటూ సుబ్బారెడ్డిపై మండిపడ్డారు. కూలీ రాకుండా చేశారంటూ రాసిన ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. 

ongole mp
mp YV Subba Reddy
food for work programme
  • Loading...

More Telugu News