vijay: మూడువేల థియేటర్స్ లో 'మెర్సెల్' రిలీజ్

  • విజయ్ తాజా చిత్రంగా 'మెర్సెల్'
  • మూడు విభిన్నమైన పాత్రలు
  • మెజీషియన్ పాత్ర కోసం ఎక్కువ కష్టం  
  • ఈనెల 18న రెండు భాషల్లో విడుదల

విజయ్ కథానాయకుడిగా నటించిన 'మెర్సెల్' చిత్రం కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'అదిరింది' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రలు చేశాడు. పంచాయతీ పెద్దగా .. డాక్టర్ గా ..  మెజీషియన్ గా ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

 ఈ మూడింటిలో మెజీషియన్ పాత్ర కోసం ఆయన బాగా కష్టపడ్డాడట. మేసడోనియా .. బల్గేరియా .. కెనడాల నుంచి ప్రముఖ మెజీషియన్స్ ను రప్పించి మరీ .. విజయ్ కి మేజిక్ ట్రిక్స్ నేర్పించారట. ఈ మూడు పాత్రల సరసన కథానాయికలుగా కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 18వ తేదీన 3000 థియేటర్స్ లో విడుదల కానుంది.   

  • Loading...

More Telugu News