australia cricket: మమ్మల్ని క్షమించండి... ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు గువహటి యువత వినతి

  • గువహటిలో ఓటమి తరువాత క్రికెటర్లపై దాడి
  • ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్లేసిన అసోం యువకులు
  • ఇప్పుడు క్షమించాలని కోరుకుంటూ ప్లకార్డుల ప్రదర్శన

గువహటిలో జరిగిన రెండో టీ-20 పోటీలో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయిందన్న ఆగ్రహంతో ఉన్న అభిమానులు, ఆసీస్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాము చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్న గువహటి యువత, ఇప్పుడు తమను క్షమించాలని వేడుకుంటోంది.

ఆసీస్ ఆటగాళ్లు బసచేసిన రాడిసన్ బ్లూ హోటల్ ముందు చేరిన వందలాది మంది యువతీ యవకులు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని, ఓ తుంటరి చేసిన పనికి, రాష్ట్ర యువతంతా క్షమించాలని వేడుకుంటోందని వారు తెలిపారు. కాగా, రాళ్లదాడిలో బస్సు అద్దాలు పగిలిన సంగతి తెలిసిందే.

australia cricket
australia cricket fans
stone pelting
  • Loading...

More Telugu News