subbarraju: అమితాబ్ తో ఆ సీన్ చేయనని పూరీతో చెప్పాను : సుబ్బరాజు
- అమితాబ్ తో కలిసి నటించే ఛాన్స్ రావడమే అదృష్టం
- ఆయన ఎదురుగా నిలబడాలంటేనే భయం
- అలాంటిది పూరి ఇంకా టెన్షన్ పెట్టేశాడు
- ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను
ఓ పాత్రను చేయడానికి నటీనటులు అంగీకరించిన తరువాత దర్శకుడు చెప్పినట్టుగా నటించవలసి ఉంటుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు మాత్రం ఆయా ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సంఘటన ఒకటి పూరి డైరెక్ట్ చేసిన 'బుడ్డా హోగా తెరా బాప్' సినిమా షూటింగులో జరిగిందంటూ, ఆ విషయాలను ఐ డ్రీమ్స్ తో సుబ్బరాజు పంచుకున్నాడు.
ఎక్కడో భీమవరంలో పుట్టిపెరిగిన తనకి అమితాబ్ తో కలిసి నటించడమే అదృష్టంగా అనిపించిందని అన్నాడు. అమితాబ్ ముందు నటించాలనేసరికి కంగారు వచ్చేసేదని చెప్పాడు. అలాంటిది తాను స్టైల్ గా కూర్చుని అమితాబ్ ముఖంపైకి సిగరెట్ పొగ వదులుతూ ఒక డైలాగ్ చెప్పవలసి వచ్చిందనీ, ఆ సీన్ చేయడానికి తాను ఒప్పుకోలేదని అన్నాడు. అయితే అలాంటివి పట్టించుకోవద్దని అమితాబ్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందనీ, తన కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన ఇదని చెప్పుకొచ్చాడు.