samanta: సమంత, చైతన్యలకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్... వైరల్ వార్త!

  • సరిగ్గా వివాహ సమయానికి సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్
  • ఉంగరాలు చూసి ఉబ్బితబ్బిబ్బైన సమంత, చై
  • వైరల్ గా మారిన వార్త

టాలీవుడ్ నటులు నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని డబ్ల్యూ హోటల్ లో అక్టోబర్‌ 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే కొత్తదంపతులు సమంత, నాగచైతన్యకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిగ్గా వివాహ సమయానికి వారిద్దరికీ ఉంగరాలు అందేలా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ప్లాన్ చేశారట.

 ఊహించని ఈ బహుమతికి వారద్దిరూ ఉబ్బితబ్బిబ్బయ్యారట. ఈ ఉంగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది. మొదట ఈ ఉంగరాలను హైదరాబాదులో నిర్వహించనున్న రిసెప్షన్ లో ఇవ్వాలని భావించారని, అయితే వివాహం సమయానికి ఇస్తేనే బాగుంటుందని భావించి, ఇలా ప్లాన్ చేశారని సమాచారం. అయితే, వైరల్ గా మారిన ఈ వార్తలో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.

కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, సమంత జంటగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. 

samanta
naga chitanya
marriage
goa
pawan kalyan
trivikram
  • Loading...

More Telugu News