batsman: నాకు కొడుకు పుట్టాడు.. ట్వీట్ చేసిన టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప

  • సంతోషాలు ఇంటికొచ్చాయన్న రాబిన్
  • పలువురు క్రికెటర్ల అభినందనలు
  • థ్యాంక్స్ చెప్పిన ఉతప్ప

టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప (31) తండ్రయ్యాడు. ఆయన భార్య శీతల్ గౌతమ్ మంగళవారం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కుమారుడితో తీసుకున్న ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. సంతోషాలు తమ దరిచేరాయని పేర్కొన్నాడు. తనను అభినందించే అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తండ్రయిన ఉతప్పకు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. రవిచంద్రన్ అశ్విన్, సురేశ్ రైనా సహా పలువురు టీమిండియా ఆటగాళ్లు ట్వీట్టర్‌ ద్వారా కంగ్రాట్స్ చెప్పారు.

కర్ణాటకకు చెందిన రాబిన్ ఉతప్ప 2006లో ఇంగ్లండ్ టూర్‌లో భారత్‌కు మొదటిసారి ఆడాడు. ఇప్పటి వరకు 46 వన్డేలు, 13 టీ20లు, 149 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 25.94 సగటుతో 934 పరుగులు చేశాడు. చివరి సారిగా హరారేలో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆడాడు.

batsman
Robin Uthappa
Sheethal
baby boy
  • Loading...

More Telugu News