Hyderabad: భర్తను పిజ్జా కొనివ్వమని అడిగింది... షాపులోంచి బయటకొచ్చేసరికి చెక్కేసింది!

  • పెళ్లయిన మర్నాడే కొత్తపెళ్లి కూతురు అదృశ్యం
  • సినిమా చూపించమని కోరిన కొత్త పెళ్లికూతురు
  • పిజ్జా షాప్ లోంచి వచ్చేసరికి ఆటోలో వెళ్లిపోయిన భార్య

పెళ్లయిన మర్నాడే భర్తకు ఝలక్ ఇచ్చి, కొత్తపెళ్లి కూతురు అదృశ్యమైన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్‌ జిల్లా కీసర మండలం ఆర్‌ఎల్‌ నగర్‌ లో పాలవ్యాపారి మాదినేని తిరుపతయ్య (23)తో కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19)కి ఈ నెల 1న పెద్దలు వివాహం చేశారు. వివాహం జరిగిన వెంటనే ఆమెను తిరపతయ్య హైదరాబాదుకు తీసుకొచ్చాడు.

మరుసటి రోజు సినిమాకు తీసుకెళ్లమని భార్య కోరడంతో సరేనని తీసుకెళ్లాడు. సినిమా పూర్తయిన తరువాత పిజ్జా కావాలని కోరింది. దీంతో భార్యను షాప్ బయట ఉంచి, పిజ్జా తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్లి వచ్చేసరికి ఆమె ఓ ఆటోలో వెళ్లిపోతుండడం కనిపించింది. దీంతో ఆమె కోసం గాలింపు చేపట్టాడు. దొరకకపోయేసరికి తిరుపతయ్య కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

Hyderabad
new married couple
bakery
pizza
  • Loading...

More Telugu News