India: శిక్షణ కోసం 3 లక్షల మంది ఉద్యోగార్థులను జపాన్ పంపిస్తున్న భారత్

  • ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం
  • వారి ఖర్చును భరించనున్న జపాన్ ప్రభుత్వం
  • 50 వేల మందికి అక్కడే ఉద్యోగాలు

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వచ్చే 3 నుంచి ఐదేళ్లలో 3 లక్షల మందిని ఉద్యోగ శిక్షణ కోసం జపాన్‌ పంపిస్తున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. శిక్షణ కోసం అయ్యే ఖర్చును జపాన్ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.  టెక్నికల్ ఇంటెర్న్ ట్రైనింగ్ ప్రోగ్రాం (టీఐటీపీ) కోసం ఇండియా-జపాన్ మధ్య మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ (ఎంఓసీ) కుదిరినట్టు మంత్రి తెలిపారు.

అక్టోబరు 16 నుంచి మూడు రోజులపాటు మంత్రి ధర్మేంద్ర  ప్రధాన్ టోక్యోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంఓసీపై సంతకాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. శిక్షణ కోసం జపాన్ వెళ్లే వారు 3-5 ఏళ్ల కాలం ఉంటారని, వీరంతా జపాన్ ఈకో సిస్టంలో పనిచేస్తారని మంత్రి తెలిపారు. అలాగే ఉద్యోగావకాశాలు కూడా పొందుతారని వివరించారు. శిక్షణ కోసం వెళ్లే వారిలో 50 వేల మందికి అక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం భారత్ చేరుకునే వారు ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాల్లో చేరుతారని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News