america: మీకు చేతనైతే ఆధారాలు చూపించండి: అమెరికాకు సవాల్ విసిరిన పాకిస్థాన్
- పాక్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అమెరికా
- అమెరికా వ్యతిరేక ఉగ్రవాద దాడులన్నీ ఆఫ్ఘనిస్థాన్ లోనే జరిగాయన్న పాక్
- నెలాఖరులో పాక్ లో పర్యటించనున్న అమెరికా అధికారులు
గత కొంత కాలంగా పాకిస్థాన్ లో ఉగ్రవాద నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా సవాల్ విసిరారు. హక్కానీ నెట్ వర్క్ పాకిస్థాన్ లో ఉందని అమెరికా నిరూపిస్తే, ఉగ్రవాద నిరోధానికి అమెరికాతో కలిసి పనిచేస్తామని అన్నారు.
అమెరికాకు చెందిన అధికారుల కిడ్నాప్, అమెరికా వ్యతిరేక దాడులన్నీ ఆఫ్ఘనిస్థాన్ లోనే జరిగాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్ లో అలాంటి ఘటనలు ఏవీ చోటుచేసుకోలేదని ఆయన చెప్పారు. ఈ నెలాఖరులో అమెరికా అధికారులు పాక్ లో పర్యటించనున్నారు.