sehwag: సెహ్వాగ్ కూడా ఆ బౌలర్‌ని చూస్తే వణికేవాడట.. స్వయంగా వెల్లడించిన త్రిశతక వీరుడు!

  • మురళీధరన్ బౌలింగ్‌లో భయపడేవాడిని
  • అతడి ముఖ కవళికలు నన్ను ఒత్తిడికి గురిచేసేవి
  • వెల్లడించిన మాజీ స్టార్ ఓపెనర్

బౌలర్ ఎవరన్న దానితో పనిలేకుండా క్రీజులో అడుగుపెట్టిన దగ్గరి నుంచి బాదడమే పనిగా పెట్టుకునే సెహ్వాగ్ కూడా ఓ బౌలర్‌కు భయపడేవాడట. ఈ విషయాన్ని సెహ్వాగే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ అంటే తనకు భయంగా ఉండేదని పేర్కొన్నాడు. అతడి బౌలింగ్ చాలా కఠినంగా ఉండేదని, షాట్ కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని పేర్కొన్నాడు.

అతడి బౌలింగ్‌లో ఎక్కడ అవుటైపోతానోనన్న భయం కూడా ఉండేదన్నాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు మురళీధరన్ ముఖ కవళికలు కూడా తనను భయపెట్టేవన్నాడు. దాంతో ఒత్తిడికి గురయ్యేవాడినన్నాడు. అతడు తప్ప మరే బౌలర్ తనను భయపెట్టలేకపోయారన్నాడు. ప్రస్తుతం భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెహ్వాగ్ భారత్ తరపున రెండు సార్లు త్రిశతకాలు సాధించిన ఒకే ఒక్కడుగా రికార్డు కొట్టిన సంగతి విదితమే! 

sehwag
team india
Muralidharan
srilanka
  • Loading...

More Telugu News