subbaraju: అందువల్లనే నేను చేసే సినిమాల సంఖ్య తగ్గింది: ఆర్టిస్ట్ సుబ్బరాజు

  • విలన్ తరహా పాత్రల్లో మెప్పించిన సుబ్బరాజు
  • 'బాహుబలి 2'లో హాస్యంతోను సందడి
  • ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు

తెలుగు తెరపై యంగ్ విలన్ గా మెప్పించిన సుబ్బరాజు .. 'బాహుబలి 2' సినిమాలో హాస్యాన్ని కూడా తనదైన శైలిలో పండించాడు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో ఎప్పుడూ బిజీగా వుండే సుబ్బరాజు, ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో కనిపించడం లేదు. ఇదే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఉద్దేశ పూర్వకంగా తాను అవకాశాలు తగ్గించుకోలేదని సుబ్బరాజు చెప్పాడు. అలాగని తనకి అవకాశాలు రాకుండా లేవని అన్నాడు.

 'బాహుబలి 2' కోసం తాను ఎక్కువ డేట్స్ కేటాయించవలసి వచ్చిందనీ, ఆ పాత్రకి గెటప్ ను కంటిన్యూ చేయవలసి వచ్చిందని చెప్పాడు. అందువలన ఆ సమయంలో వచ్చిన సినిమాలు చేయలేకపోయాననీ, అవే సినిమాలు ఈ మధ్యన విడుదలయ్యాయని అన్నాడు. 'బాహుబలి 2' సినిమా షూటింగు ఉండటం వల్లనే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను గానీ, మరే కారణాలు లేవని చెప్పుకొచ్చాడు.      

  • Loading...

More Telugu News