mukul roy: ఉప‌రాష్ట్ర‌ప‌తికి రాజీనామా లేఖ స‌మ‌ర్పించిన ఎంపీ ముకుల్ రాయ్‌

  • రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా
  • బీజేపీలో చేరే అవ‌కాశం?
  • ఇటీవ‌ల బీజేపీ నాయ‌కుల‌ను క‌లిసిన ముకుల్‌

మాజీ తృణ‌మూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ ముకుల్ రాయ్ ఇవాళ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడికి త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. మూడు రోజుల క్రితం ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ అధ్య‌క్షుడు కైలాష్ విజ‌య్‌వ‌ర్గీయ‌ను ముకుల్ క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. గ‌త నెల 25వ తేదీన తన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ముకుల్ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌టన చేసిన కొన్ని గంట‌ల్లోనే పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాలకు పాల్ప‌డుతున్నాడ‌న్న నెపంతో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు.

mukul roy
vice president
resignation
venkaiah naidu
trinamool congress
rajyasabha
  • Loading...

More Telugu News