yanamala ramakrishnudu: జగన్ పాదయాత్ర అసలు ఉద్దేశం ఇదే!: యనమల

  • ఇడుపులపాయలోని సొమ్మును తరలించడానికే పాదయాత్ర
  • అక్కడ బంకర్లు కూడా ఉన్నాయి
  • ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు

ఇడుపులపాయలో దాచి ఉంచిన సొమ్మును తరలించడమే జగన్ పాదయాత్ర వెనకున్న అసలు ఉద్దేశం కావచ్చని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా టీడీపీ కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

 'పాదయాత్ర చేసుకుంటా, ఆరు నెలలపాటు పర్మిషన్ ఇవ్వండి' అంటూ కోర్టును జగన్ వేడుకుంటున్నారని... కోర్టు పర్మిషన్ ఎలా ఇస్తుందని యనమల ఎద్దేవా చేశారు. పాదయాత్ర సమయంలో ఇడుపులపాయ నుంచి జగన్ ఏం పట్టుకెళతాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. ఇడుపులపాయలో బంకర్లు ఉన్నాయనే విషయాన్ని తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని... అయితే, ఈ బంకర్లలో ఏముందనేది ఎవరికీ తెలియదని చెప్పారు. ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని యనమల అన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ మేలు జరిగేలా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని చెప్పారు. 

yanamala ramakrishnudu
Telugudesam
ys jagan
ysrcp
jagan padayatra
  • Loading...

More Telugu News