arjun reddy: జాక్ పాట్ కొట్టిన 'అర్జున్ రెడ్డి' దర్శకుడు

  • దర్శకుడు సందీప్ రెడ్డికి పెరిగిన డిమాండ్
  • సందీప్ తో మైత్రి మూవీ మేకర్స్ ఒప్పందం
  • రూ. 50 లక్షల అడ్వాన్స్ కూడా చెల్లింపు? 


విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి సినీ రంగంలోని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం బంపర్ హిట్ కావడంతో సందీప్ తో సినిమా చేయాలని పలువురు హీరోలు, నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారట. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' లాంటి సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు కూడా సందీప్ ను సంప్రదించారట.

తమ బ్యానర్ లో సినిమాను చేయడానికి సందీప్ ను ఒప్పించడమే కాకుండా... రూ. 50 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ప్రస్తుతం వీరు రామ్ చరణ్ తో 'రంగస్థలం', నాగచైతన్యతో 'సవ్యసాచి' సినిమాలను నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో సందీప్ తో మరో సినిమాను నిర్మించాలని వీరు భావిస్తున్నారు. అయితే, ఇందులో హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఖరారవలేదు. మరోవైపు, హీరో శర్వానంద్ కూడా సందీప్ తో ఒక సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు.

arjun reddy
director sandeep reddy
maitri movie makers
sarvanand
  • Loading...

More Telugu News