ravichandran aswin: ఇలాంటి చర్యలతో మన దేశానికి చెడ్డపేరు వస్తుంది: క్రికెటర్ అశ్విన్

  • రాయి విసరడం సరైంది కాదు
  • అందరూ బాధ్యతాయుతంగా మెలగాలి
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన అశ్విన్

గువహటిలో టీ20 మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు వెళుతున్న బస్సుపై దాడి చేయడాన్ని టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టాడు. బస్సుపై రాళ్లు రువ్వడం సరైన పని కాదని అన్నాడు. ఇలాంటి చర్యలు మన దేశానికి చెడ్డ పేరును తీసుకొస్తాయని చెప్పాడు. అతిథులను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపాడు. అందరూ బాధ్యతాయుతంగా మెలగాలంటూ ట్వీట్ చేశాడు.

మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు హోటల్ కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సుకు కుడివైపున ఉన్న అద్దం ధ్వంసమైంది. అయితే, ఎవరికీ గాయాలు కాకపోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ravichandran aswin
team india
australia cricket
  • Loading...

More Telugu News