david warner: హైదరాబాద్ ప్రేక్షకులు మాకు మద్దతిస్తారని ఆశిస్తున్నాం: డేవిడ్ వార్నర్

  • ప్లాన్లను పక్కాగా అమలు చేయగలిగాం
  • జాసన్ మంచి బౌన్స్ ను రాబట్టాడు
  • ప్రారంభంలో పిచ్ ఇంగ్లండ్ పిచ్ ల మాదిరిగా ఉంది

రెండో టీ20లో విజయం సాధించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు. చివరగా తమ ప్లాన్లను పక్కాగా అమలు చేయగలిగామని చెప్పాడు. తమ పేస్ బౌలర్ జాసన్ మంచి బౌన్స్ ను రాబట్టగలిగాడని తెలిపాడు. పెర్త్ నుంచి వచ్చిన జాసన్ కు సరైన లక్ష్యం ఉందని... ఆకాశమే అతని హద్దు అని చెప్పాడు. ఆడం జంపా కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడని తెలిపాడు.

ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెన్రిక్స్... అతని అనుభవాన్నంతా ప్రదర్శించాడని కితాబిచ్చాడు. ప్రారంభంలో పిచ్ ఇంగ్లండ్ పిచ్ ల మాదిరిగా ఉందని చెప్పాడు. చివరి టీ20 హైదరాబాదులో జరగనుందని... హైదరాబాద్ ప్రేక్షకులు తమకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపాడు. 

david warner
australia cricket
australia cricket captain
team india
  • Loading...

More Telugu News