china: గంటల తరబడి గేమ్ ఆడి చూపు పోగొట్టుకున్న చైనా యువతి
- `ఆనర్ ఆఫ్ కింగ్స్` గేమ్ ఆడిన యువతి
- విరామం లేకుండా ఆడటం వల్ల కళ్లకు ముప్పు
- చికిత్స చేస్తున్న వైద్యులు
స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్లు అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ గేమింగ్ బాగా అభివృద్ధి చెందింది. దీంతో ఇంట్లో కూర్చునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆటగాళ్లతో ఆడే వీలు కలిగింది. ఇటీవల `ఆనర్ ఆఫ్ కింగ్స్` అనే ఆన్లైన్ గేమ్ వైరల్గా మారింది. దీన్ని ఆడటం మొదలు పెట్టిన వారు గంటల తరబడి ఆడుతూనే ఉండిపోతున్నారు. అలాగే చైనాకు చెందిన ఓ యువతి కూడా ఈ ఆటను వ్యసనంగా మార్చుకుంది. వారాంతాల్లో పని లేనప్పుడు ఒక్కసారి కూడా విరామం తీసుకోకుండా ఆడేది.
ఆ విధంగా ఈ మధ్య దాదాపు 24 గంటల పాటు ఈ ఆటను ఆడింది. దీంతో ఆమె కుడి కన్ను చూపును కోల్పోయింది. యుక్తవయసు వారిలో అరుదుగా కనిపించే రెటినల్ ఆర్టరీ అక్లసన్ (ఆర్ఏవో) లోపం వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఎక్కువసేపు స్మార్ట్ఫోన్ తెరను చూడటం వల్ల ఈ పాక్షిక అంధత్వం కలిగిందని వారు చెబుతున్నారు. ఆమె చూపును తిరిగి తెచ్చేందుకు చికిత్స చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఆన్లైన్ గేమ్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ప్రతీ అరగంటకు కంటికి విరామం ఇవ్వాలని లేదంటే దృష్టి తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.