virat kohli: మా ఓటమికి కారణం ఇదే: కోహ్లీ

  • బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం
  • పరిస్థితులు బాగోలేనప్పుడు 120 శాతం కష్టపడాలి
  • ఆసీస్ బౌలర్ జాసన్ మంచి స్పెల్ వేశాడు

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై స్పందించిన కోహ్లీ... తమ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని చెప్పాడు. క్రీజులో కుదురుకునేంత వరకైనా వికెట్లను అంటిపెట్టుకుని ఉండాల్సిందని అన్నాడు. శుక్రవారం జరిగే చివరి టీ20లో మన బ్యాట్స్ మెన్లు చెలరేగి ఆడాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

ఫీల్డ్ లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం 120 శాతం కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు తమకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించారని చెప్పాడు. ఈ సందర్భంగా ఆసీస్ పేస్ బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్ ను కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. నాలుగు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను కూల్చాడని కితాబిచ్చాడు.

virat kohli
team india
2nd t20
australia cricket
  • Loading...

More Telugu News