Muslims: మహిళల హజ్ యాత్ర విషయంలో.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లిం మేధావులు!

  • కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన జామియత్ ఉలేమా
  • పురుషులతో మహిళలు సమానం కాదు
  • మహిళల్ని షరియత్ కు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు

షరియత్ చట్టాలు మహిళలపై చిన్నచూపు చూస్తాయని, మహిళలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తాయని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం మేధావుల సంఘం జామియత్ ఉలేమా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మగవారి చాటునే మహిళలు ఉండాలని బలంగా వాదించే జామియత్ ఉలేమా.. తాజగా కేంద్ర ప్రభుత్వం... 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు జట్టుగా ఏర్పడి, పురుషుడి తోడు లేకుండా హజ్ యాత్రకు అనుమతి కోరితే ఇస్తామన్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది.

ఈ సందర్భంగా మహిళలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువేనని స్పష్టం చేసింది. షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా మహిళలను తయారు చేస్తున్నారని వారు మండిపడ్డారు. సమాన స్థాయిని ఆశిస్తే గర్భాన్ని మోసే కాలాన్ని కూడా పంచమంటారని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News