america: హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్ర బయటపడిందంటున్న ఉత్తరకొరియా హ్యాకర్లు

  • 235 గిగా బైట్ల డేటాను దొంగిలించిన హ్యాకర్లు
  • కిమ్ జాంగ్ ఉన్ ను హతమార్చే కుట్ర వేసిన అమెరికా, దక్షిణకొరియా
  • దక్షిణకొరియా డిఫెన్స్ మినిస్ట్రీస్ పేరిట ఉన్న పత్రాలు

హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టామని ఉత్తరకొరియా హ్యకర్లు చెబుతున్నారు. దక్షిణ కొరియాపై హ్యాకింగ్ చేసి 235 గిగా బైట్ల డేటాను దొంగిలించామని తెలిపారు. తాము తస్కరించిన డేటాలో అమెరికా, దక్షిణకొరియాల సైనిక రహస్యాలు ఉన్నాయని వారు తెలిపారు. తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను హతమార్చేందుకు అమెరికా, దక్షిణకొరియాలు కుట్రపన్నాయని తెలిపారు.

 అంతే కాకుండా ఆ రెండు దేశాలు యుద్ధం సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచారని వారు వెల్లడించారు. దక్షిణ కొరియా డిఫెన్స్ మినిస్ట్రీ పేరిట ఉన్న ఈ పత్రాలు తమ చేతికి చిక్కడంతో దక్షిణ కొరియా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందని వారు చెబుతున్నారు. అమెరికా లక్ష్యం తమ దేశాధ్యక్షుడ్ని హతమార్చడమేనని, దానికి దక్షిణ కొరియా పూర్తి సహకారం అందిస్తుందని ఆ పత్రాల ద్వారా వెల్లడైందని వారు తెలిపారు. 

america
south Korea
war
warning
hacking
  • Loading...

More Telugu News