dera baba: డేరా బాబాను కలవడానికి వచ్చిన తల్లి, కుమారుడు, కుమార్తె, అల్లుడు
- గుర్మీత్ తన కుటుంబాన్ని కలవడం ఇది రెండోసారి
- సెప్టెంబర్ 15న బాబాను కలిసిన తల్లి
- శిక్ష పడిన 45 రోజుల తర్వాత సందర్శనకు వచ్చిన ఇతర కుటుంబీకులు
అత్యాచారం కేసులో శిక్ష పడి, రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో మగ్గుతున్న బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను చూడటానికి అతని కుటుంబం వచ్చింది. తల్లి నసీబ్ కౌర్, కుమారుడు జస్వంత్, కుమార్తె అమర్‌ప్రీత్, అల్లుడు షాన్-ఏ-మీత్‌లు గుర్మీత్‌ను కలవడానికి వచ్చారు. గుర్మీత్‌కి శిక్ష పడిన తర్వాత కుటుంబ సభ్యులను కలవడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 15న తల్లి నసీబ్ కౌర్ ఆయనను కలవడానికి వచ్చింది. శిక్ష పడిన దాదాపు 45 రోజుల తర్వాత ఆయన కుటుంబం చూడటానికి వచ్చింది.
తనను కలవడానికి వచ్చే 10 మంది పేర్లను డేరా బాబా పోలీసులకు ఇచ్చాడు. ఇందులో మొదటి పేరుగా హనీప్రీత్‌ని పేర్కొన్నాడు. ఆమె ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. ఇంగ్లిషు వర్ణమాల ప్రకారం బాబా ఇచ్చిన జాబితాలోని వాళ్లు సోమ, గురు వారాల్లో ఆయనను కలవవచ్చు. జైలు నిబంధనల ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. తన కుటుంబ సభ్యులతో అరగంటపాటు మాట్లాడిన బాబా ఉద్వేగానికి లోనయినట్లు సమాచారం.