hyderabad rains: పటాన్ చెరు - నర్సాపూర్ దారిలో కూలిన బ్రిడ్జ్

  • భారీ వర్షాలకు పొంగిన పెద్దవాగు
  • కొట్టుకుపోయిన వంతెన
  • 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా జంట నగరాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్ చెరు, నర్సాపూర్ దారిలో ఉన్న తాత్కాలిక బ్రిడ్జ్ కూలిపోయింది. కుండపోతగా కురిసిన వర్షంతో పెద్దవాగు పొంగి ప్రవహించింది. దీంతో, దానిపై ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయింది. ఇలా వంతెన కొట్టుకుపోవడంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో, ఆ గ్రామాల ప్రజలంతా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.

hyderabad rains
hyderabad
heavy rains
  • Loading...

More Telugu News