chandrababu: ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా ఎందుకీ యువభేరీలు?: జగన్ పై చంద్రబాబు విమర్శలు

  • ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని అన్నారు
  • ముందు ఆ పని చేయాలి
  • ముద్రగడను రాష్ట్రంలో ఎవరూ నమ్మడం లేదు

అనంతపురంలో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన యువభేరి కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలందరి చేత రాజీనామాలు చేయిస్తామంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ముందు ఎంపీలతో రాజీనామాలు చేయించాలని అన్నారు. రాజీనామాలు చేయించకుండా ఈ యువభేరిలు ఎందుకని ఎద్దేవా చేశారు.
 
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఓ ప్రణాళిక మేరకు, కావాలనే ఉద్యమం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ముద్రగడను ఎవరూ నమ్మడం లేదని అన్నారు. నదులకు హారతులు ఇచ్చి, మహాసంకల్పం చేశామని... అందుకే రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత అనంతపురం జిల్లాలో వరదలు వచ్చాయని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఆ పార్టీ చూసుకుంటుందని అన్నారు. 

chandrababu
ap cm
mudragada padmanabham
kapu reservations
ys jagan
ys jagan yuvabheri
  • Loading...

More Telugu News