shah rukh khan: భార్య వ్యాపారాన్ని ప్ర‌చారం చేస్తున్న షారుక్‌!

  • వీడియో షేర్ చేసిన న‌టుడు
  • ఇంటీరియ‌ర్ డిజైనింగ్ వ్యాపారంలో రాణిస్తున్న గౌరీ ఖాన్‌
  • ధ‌నికుల ఇళ్ల‌కు కొత్త హంగులు దిద్దే ప్ర‌య‌త్నం

బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్‌, త‌న భార్య గౌరీ ఖాన్ చేస్తున్న వ్యాపారానికి త‌న వంతు ప్ర‌చారాన్ని క‌ల్పిస్తున్నాడు. ఆమె ఇంటీరియ‌ర్ డిజైనింగ్ వ్యాపారానికి సంబంధించిన ఓ వీడియోను షారుక్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

 `గౌరీ ఖాన్ డిజైన్స్‌` పేరుతో ఆమె ఓ సంస్థ‌ను స్థాపించింది. డిజైనింగ్‌లో గౌరీకి ఉన్న ఆస‌క్తికి గౌరీ ఖాన్ డిజైన్స్ అద్దం పడుతోంద‌ని షారుక్ పేర్కొన్నాడు. జులైలో ప్రారంభమైన ఈమె సంస్థ కొద్ది కాలంలో ముంబైలో మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. ఫ‌రాఖాన్‌, రాణీ ముఖ‌ర్జీ, సుజానే రోష‌న్‌, క‌ర‌ణ్ జొహార్‌, క‌రిష్మా క‌పూర్‌, మ‌లైకా అరోరా, శ్రీదేవీ, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, కాజోల్‌, అర్జున్ క‌పూర్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్, నీతా అంబానీ వంటి ప్ర‌ముఖులు `గౌరీ ఖాన్ డిజైన్స్‌`ను సంద‌ర్శించారు. ముంబైలోని ధ‌నికుల ఇళ్ల‌ను మ‌రింత అందంగా తీర్చిదిద్ద‌డానికి గౌరీ ఖాన్ డిజైన్స్ స‌హాయ‌ప‌డుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News