pv sindhu: పద్మభూషణ్ కు పివి సింధు పేరు.. సిఫారసు చేసిన కేంద్ర క్రీడల శాఖ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-77fbaefcb5957b26f866d98fbf81b10c86184f18.jpg)
- పద్మభూషణ్ రేసులో పివి సింధు
- వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి
- సింధు పేరును ప్రతిపాదించిన క్రీడల శాఖ
భారత స్టార్ షట్లర్ పివి సింధు పేరును పద్మభూషణ్ పురస్కారం కోసం కేంద్ర క్రీడల శాఖ సిఫారసు చేసింది. పద్మ పురస్కారాల్లో భాగంగా ఆమె పేరును ప్రతిపాదించింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన సింధు... ఆ తర్వాత పలు విజయాలతో సత్తా చాటింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన ఆమె... కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కు ఆమె పేరును సిఫారసు చేశారు.