roger fedarer: రాకెట్ పక్కనపెట్టి కోర్టులో డాన్స్ చేసిన రోజర్ ఫెదరర్... వీడియో చూడండి!

  • కాసేపు టెన్నిస్ రాకెట్ పక్కనపెట్టిన ఫెదరర్
  • కోర్టులో డాన్స్ చేసిన ఫెదరర్
  • అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియో

స్విస్‌ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రాకెట్ పక్కనపెట్టి కోర్టులో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాని వివరాల్లోకి వెళ్తే... చైనాలో షాంగైలో రోలెక్స్‌ మాస్టర్స్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్ ఆడేముందు 19 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేత రోజర్ ఫెదరర్ స్టేడియంలోకి వచ్చాడు.

ఇంతలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మిక్కీ మౌస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ఫెదరర్ వద్దకు వచ్చి డాన్స్ చేయాలని కోరాడు. అతని కోరికమేరకు ఫెదరర్ డాన్స్ చేశాడు. ఈ వీడియోను ఏటీపీ టెన్నిస్ టీవీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది. దిగ్గజానికి భేషజాలు లేవని అభిమానులు పేర్కొంటున్నారు.  

roger fedarer
atp tennis tv
dance
  • Loading...

More Telugu News