Hyderabad: గోడ కూలడంతో.. సినీ నటుడు మనోజ్ నందం కారు ధ్వంసం!

  • రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు
  • కూలిన గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రహరీ గోడ
  • గోడపక్కనే నడుస్తున్న మహిళకు గాయాలు

టాలీవుడ్ నటుడు మనోజ్ నందం కారు ధ్వంసమైంది. గత రెండు రోజులుగా హైదరాబాదును వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రహరీ గోడ బాగా నానిపోయి, పెద్ద శబ్దంతో కూలిపోయింది. ఆ సమయంలో గోడ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఇటుకలు, బండరాళ్లు పడడంతో ఆమె సృహ కోల్పోయింది.

వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అదే గోడపక్కన పార్కింగ్ చేసిన రెండు కార్లపై ఈ గోడ శిథిలాలు పడడంతో అవి ధ్వంసమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో తన స్నేహితులతో కలిసి అదేరోడ్డులో వెళ్తున్న టాలీవుడ్ నటుడు మనోజ్ నందం కారుపై కూడా అవి పడ్డాయి. దీంతో అతని కారు ధ్వంసమైంది. దీనిపై మనోజ్ నందం ట్వీట్ చేస్తూ, పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నాడు. 

Hyderabad
raining
varsham
problems
  • Loading...

More Telugu News