ram gopal varma: అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి 'వ్యంగ్య సలహా' ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!

  • అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ ముందు నిర్వహించండి
  • ఆ తర్వాత రాజమౌళితో గ్రాఫిక్స్ వర్క్ చేయించండి
  • ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప అసెంబ్లీ మరొకటి ఉండదు

అమరావతిలో అద్భుతమైన అసెంబ్లీని నిర్మించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రభుత్వానికి అందించింది. అయితే, మరింత గొప్పగా డిజైన్లు ఉండాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అంతేకాదు, దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం సూచించారు.

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఫేస్ బుక్ లో స్పందించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీని నిర్మించడం దండగ అని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఒక గొప్ప సలహాను ఇస్తున్నానని... అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్కీన్ ముందు నిర్వహించాలని... ఆ తర్వాత రాజమౌళి సహకారంతో గ్రాఫిక్స్ జతచేసి టెలికాస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇలా చేస్తే మన అసెంబ్లీ ప్రపంచంలోని అన్ని అసెంబ్లీల కన్నా గొప్పగా ఉంటుందని అన్నారు. ఎందుకంటే ఇది 'బాహుబలియన్ అసెంబ్లీ' కాబట్టి అంటూ ముగించారు. 

ram gopal varma
ap assembly
ram gopal varma suggestion
varma suggestion to ap government
  • Loading...

More Telugu News