Kajal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మళ్లీ మళ్లీ చేయాలంటే బోర్ అంటున్న కాజల్ 
  • 'కర్ణ'గా నందమూరి బాలకృష్ణ 
  • 'ఉన్నది ఒకటే జిందగీ' పాటలు విడుదల 
  • తమిళ 'అర్జున్ రెడ్డి'కి బాల దర్శకత్వం

*  'ఒకసారి చేసేసిన పాత్ర మళ్లీ మళ్లీ చేయాలంటే మహా విసుగొస్తుంది' అంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. "కొత్త కథలు వింటున్నప్పుడు ఇంతకుముందు చేసేసిన పాత్రల ఛాయలే ఒక్కోసారి కనిపిస్తుంటాయి. అలాంటివి మళ్లీ చేయాలంటే బోర్ కొడుతుంది. అందుకే, అలాంటివి వస్తే కనుక 'వద్దులెండి' అని చెప్పి తప్పించుకుంటాను" అని చెప్పింది కాజాల్.    
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే కుంభకోణంలో పూర్తయింది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'కర్ణ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం.
*  ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రంలోని పాటలను ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. పాటలతో పాటు ట్రైలర్ ని కూడా అదే రోజున విడుదల చేస్తామని, చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేస్తామని నిర్మాత స్రవంతీ రవికిషోర్ తెలిపారు. అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్లుగా నటించారు.
*  తెలుగులో సూపర్ హిట్టయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. హీరో విక్రం కొడుకు ద్రువ్ విక్రం హీరోగా నటించే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వం వహిస్తాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News