paritala sunitha: 15 ఏళ్ల తర్వాత జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది: పరిటాల సునీత

  • రాయలసీమలో భారీ వర్షాలు
  • అనంతపురంలో నీట మునిగిన ప్రాంతాల్లో సునీత పర్యటన
  • బాధితులను ఆదుకుంటామని భరోసా

రాయలసీమలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా, అనంతపురంలో వర్షాలకు జలమయమైన పలు ప్రాంతాల్లో మంత్రి పరిటాల సునీత పర్యటించారు. సుందరయ్య కాలనీ, బీఎన్ఆర్ కాలనీ, దండోర కాలనీ, జాకీర్ కొట్టాల, పండమేరు వాగు, నడిమివంక ప్రాంతాలను ఆమె పరిశీలించారు. దీనికి తోడు రాప్తాడులోని మైనారిటీ, సీపీఐ కాలనీల్లో కూడా ఆమె పర్యటించారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 15 ఏళ్ల తర్వాత జిల్లాలో ఈ స్థాయి వర్షపాతం నమోదైందని చెప్పారు. నష్టపోయిన అన్ని కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు బియ్యం, కిరోసిన్ అందిస్తామని తెలిపారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

paritala sunitha
rains in anantapur
  • Loading...

More Telugu News