jimmy kemmel: అధ్యక్ష పదవి వదిలెయ్ ట్రంప్.. నా షో మొత్తం నీకే ఇచ్చేస్తా: అమెరికన్ యాంకర్ జిమ్మీ కెమ్మెల్ ట్వీట్

- టీవీ షోలు ప్రతిపక్షానికి మద్దతిస్తున్నాయంటూ ట్రంప్ ట్వీట్
- ఆ ట్వీట్‌కి కౌంటర్ ఇచ్చిన జిమ్మీ
- జిమ్మీకి మద్దతిచ్చిన ఇతర యాంకర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవిని వదిలేస్తే తన కార్యక్రమాన్ని పూర్తిగా ట్రంప్‌కి అంకితం ఇస్తానని ప్రముఖ అమెరికన్ యాంకర్ జిమ్మీ కెమ్మెల్ తన ట్వీట్‌లో వెల్లడించాడు. టీవీ కార్యక్రమాలను కామెంట్ చేస్తూ ట్రంప్ చేసిన ట్వీట్‌కి జిమ్మీ గట్టిగా సమాధానం చెప్పాడు. `రాత్రి పూట ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ మాటిమాటికి డెమోక్రటిక్ వాళ్ల గురించి చర్చలు చేస్తూ చిరాకు తెప్పిస్తున్నాయి. ఇది పూర్తిగా ట్రంప్ విధానానికి వ్యతిరేకం. కొంచెం మా వాళ్లకి కూడా సమయం కేటాయించండి` అని ట్రంప్ ట్వీట్ చేశాడు (ఇక్కడ `మా వాళ్లు` అంటే రిపబ్లికన్లు).
