adnan sami: అద్నాన్ కూతురు మెదీనాను ముద్దు చేసిన సుష్మా స్వ‌రాజ్‌!

  • కుటుంబ‌స‌మేతంగా విదేశాంగ మంత్రిని క‌లిసిన అద్నాన్‌
  • ఫొటోలు ట్వీట్ చేసిన గాయ‌కుడు
  • ఇప్ప‌టికే మోదీ, స్మృతీ ఇరానీ, మెహ‌బూబా ముఫ్తీల‌ను క‌లిసిన అద్నాన్ దంప‌తులు

ప్ర‌ముఖ గాయ‌కుడు అద్నాన్ స‌మీ త‌న కుటుంబ స‌మేతంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ దంప‌తుల‌ను క‌లిశాడు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో అద్నాన్, ఆయ‌న భార్య రోయా, కూతురు మెదీనాలతో క‌లిసి సుష్మా స్వ‌రాజ్‌, ఆమె భ‌ర్త స్వ‌రాజ్ కౌష‌ల్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సుష్మా త‌న కూతురు మెదీనాను ముద్దు చేస్తున్న ఫొటోల‌ను అద్నాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. అద్నాన్‌కి భార‌త పౌర‌స‌త్వం క‌ల్పించిన త‌ర్వాత ఆయ‌న త‌న కుటుంబ‌స‌మేతంగా మంత్రుల‌ను క‌లిసి, కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మంత్రి స్మృతీ ఇరానీ, జ‌మ్మూ కాశ్మీర్ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీల‌ను ఆయ‌న క‌లిశారు.
 

adnan sami
smriti irani
medina
roya
twitter
sushma swaraj
swaraj kaushal
  • Loading...

More Telugu News